- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap Politics:గెలిపిస్తే నిత్యం ప్రజలతోనే..ప్రజా సేవలోనే: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటానని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని 52, 56, 57 వార్డుల పరిధిలో ఆటో కార్మికులతో శనివారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత రెండున్నరేళ్లుగా నియోజకవర్గ ఇంచార్జిగా 220 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. ఏనాడూ ప్రజల ముఖం చూపించని టీడీపీ ఎమ్మెల్యే గణబాబు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టారు.
లోకల్.. నాన్ లోకల్ అంటున్న గణబాబు, లోకల్ లో వుండి ఎప్పుడైనా నియోజకవర్గంలో తిరిగారా అని ప్రశ్నించారు. గత 14 ఏళ్లుగా డైయిరి చైర్మన్ గా ఉన్న తనకు వైసీపీ ఇంచార్జి ఇచ్చిన తర్వాత ప్రజలతో మమేకం అయ్యానని అన్నారు. తాను ఉత్తరంధ్ర జిల్లాలకే లోకల్ అంటూ, దుష్ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. సొంత నిధులతో కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టిడ్కొ ఇల్లు పూర్తి చేసిన ఘనత తమదేనని, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి, ఎమ్మెల్యేగా విజయం చేకూర్చాలని ఆకాంక్షించారు. నియోజకవర్గం పరిశీలకులు మాజీ శాసనసభ్యుడు ఎస్ ఏ రెహమాన్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై ప్రత్యర్ధులు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు.
ఆటో కార్మికుల సంక్షేమం చూసిన ప్రభుత్వం ఒక్క వైసీపీ మాత్రమే అని అన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ ని గెలిపించి, ఆయన సేవలను పొందాలని విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. వైసీపీ ప్రభుత్వం రావాలంటే ఆడారి ఆనంద్ కుమార్ ఎమ్మెల్యే కావాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్కు డైరెక్టర్ కొణతాల నర్సింగారావు, వివిధ వార్డులకు సంబంధించిన ముఖ్య నేతలు పాల్గొన్నారు.