ఆ బీచ్ లలో ముగ్గురు వ్యక్తులను కాపాడిన జీవీఎంసీ లైఫ్ గార్డులు..

by Jakkula Mamatha |
ఆ బీచ్ లలో ముగ్గురు వ్యక్తులను కాపాడిన జీవీఎంసీ లైఫ్ గార్డులు..
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థ జోన్ -2, 4 లో ఆర్కే బీచ్, రుషికొండ బీచ్ లో ముగ్గురు వ్యక్తులను కాపాడిన జీవీఎంసీ లైఫ్ గార్డులు. శనివారం సముద్రంలో దిగి ఆత్మహత్యకు యత్నించిన ఒక వ్యక్తిని, ఇద్దరు పర్యాటకులను జీవీఎంసీ లైఫ్ గార్డులు రక్షించి ప్రాణాలు కాపాడడం జరిగిందని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ ఆదివారం తెలిపారు. విశాఖ నగరంలో బర్మా కాలనీకి చెందిన 60 సంవత్సరాలు గల నక్కా లక్ష్మమ్మ అనే వ్యక్తి అనారోగ్యం కారణంగా మనస్థాపంతో ఆర్కే బీచ్ లో దిగి శనివారం ఆత్మహత్యకు యత్నించడం జరిగిందని, అలాగే రుషికొండ బీచ్ లో అలల ఒడిలో చిక్కుకున్న ఇద్దరు పర్యాటకులు యెమన్ దేశానికి చెందిన 38 సంవత్సరాలు గల గొబ్రాన్ అనే వ్యక్తి , నగరంలో ఆరిలోవ కు చెందిన 17 సంవత్సరాల శివ అనే వ్యక్తి ని నిరంతరం నిఘా లో ఉన్న జీవీఎంసీ లైఫ్ గార్డులు జె. హరీష్, ఎం. నవీన్, టీ.పోలిరాజు , ఓ .రాజు, జి. చిన్న, అప్పన్న, కే .రాజు లు సముద్రంలోకి వెళ్లి ఆయా వ్యక్తులను రక్షించి ప్రాణాలను కాపాడడం జరిగింది. అనంతరం ఆ వ్యక్తులను మందలించి సంబంధిత పోలీస్ స్టేషన్ కు అప్పగించడం జరిగిందని కమిషనర్ తెలిపారు.

విశాఖ నగర సముద్రతీరంలో విహరించేందుకు విహార యాత్రికులు, తీర్థయాత్రికులు బీచ్లలో ప్రమాదవశాత్తు సముద్రంలో కి వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్న వారిని రక్షించేందుకు జీవీఎంసీ లైఫ్ గార్డులు నిరంతరం వారిని గమనించడమే కాకుండా ప్రత్యేకంగా ఒంటరిగా బీచ్ ల లోకి వెళ్తున్న వారిపై ప్రత్యేక నిఘాతో విధులు నిర్వహిస్తూ సముద్రంలో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడటం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. విశాఖ నగర బీచ్ లో విహరిస్తున్న వారు బీచ్ అందాలను చూస్తూ ఆహ్లాదంతో ఆనందంగా గడపాలని, సముద్రంలో దిగి ప్రమాదాలకు గురి కావద్దని, ఆత్మహత్యలకు పాల్పడకూడదని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రానున్న శివరాత్రికి సముద్ర స్నానాలకు అధిక సంఖ్యలో భక్తులు రానున్నందున, ప్రమాదాలు సంభవించకుండా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు జీవీఎంసీ ప్రత్యేకమైన రోబోటిక్ యంత్రాలను అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed