Global Investors Conferenceకు రావాలని కేంద్రమంత్రులకు ఆహ్వానం

by srinivas |   ( Updated:2023-02-10 12:12:11.0  )
Global Investors Conferenceకు రావాలని కేంద్రమంత్రులకు ఆహ్వానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖపట్నం కేంద్రంగా మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమావేశానికి హాజరుకావాలని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, మన్సుఖ్ మాండవీయ, కిషన్ రెడ్డిలను ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌లు కలిశారు. ఢిల్లీలోని కేంద్రమంత్రుల ఛాంబర్లలో కలిసి ఆహ్వానించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్, ఐటీ నైపుణ్య శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, సలహాదారు లంకా శ్రీధర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story