Good News: మే 2వ వారంలో చెల్లింపులు

by srinivas |   ( Updated:2023-04-17 14:26:53.0  )
Good News: మే 2వ వారంలో చెల్లింపులు
X

దిశ, విజయనగరం: సముద్రంలో చేపల వేట ప్రతి ఏటా నిలుపుదల చేసినట్లుగానే ఈ ఏడాది సైతం వేట నిలిపివేశారు. దీంతో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు ప్రభుత్వం గుడ్ చెప్పింది. మత్స్యకార భరోసా పథకం ద్వారా ఆర్ధిక సహాయం అందించేందుకు సిద్ధమైంది. మత్స్య శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మత్స్య శాఖ ఉప సంచాలకులు ఎన్. నిర్మలా కుమారి సమీక్షించారు. సముద్ర తీర మండలాలైన పూసపాటిరేగ, భోగాపురం మండలాలలోని అన్ని లాండింగ్ సెంటర్లలోనూ మత్స్య శాఖ సిబ్బంది, గ్రామ మత్స్య సహాయకులు, సాగర మిత్రలతో సర్వేను నిర్వహించడం జరిగింది. తదనంతరం డేటా ఎంట్రీ చేసి అర్హత మేరకు అర్హులైన మత్స్యకారులందరికి మే రెండో వారంలో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా చెల్లించబడునని తెలిపారు. మత్స్యశాఖ అభివృద్ధి అధికారి కుమారి యు.చాందిని, మెరైన్ సీఐ వి.శ్రీనివాస రావు, టి.రమేష్ ఎస్.ఐ.లు జిల్లాలో గల అన్ని ఫిష్ లాండింగ్ సెంటర్ల యందు ప్రశాంతంగా ఎన్యుమరేషన్ జరిగేటట్లు పర్యవేక్షించారు.

Advertisement

Next Story

Most Viewed