- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి చేసిన చంద్రబాబుకే మొదటి ఓటు..
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఐటీ ని అభివృద్ధి చేసిన చంద్రబాబుకే మొదటి ఓటు వేయండి అని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపు నిచ్చారు. ‘మై ఫస్ట్ ఔట్ ఫర్ సీబీఎన్’ పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జీ తో కలిసి ఆయన మాట్లాడుతూ.. మొదటి సారి ఓటు వేసే యువత అవగాహన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామని చెప్పారు. మొదటి సారి ఓటు వేసే యువత ఈ రాష్ట్ర దిశను మారుస్తారనీ ప్రతి యువత అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు. ఐటీ పరంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబే అని, విశాఖలో ఐటీ ఎస్ఈ జెడ్ లో నగరంలో ఐటీ కంపెనీ లకు చంద్రబాబు ప్రోత్సహిస్తే జగన్ రెడ్డి ఇంక్యుబేషన్ సెంటర్లు తీసేసి పరిపాలన భవనాలుగా మార్చుకున్నారని విమర్శించారు. విశాఖ నుంచి హెచ్ఎస్బీసీ గ్రూప్ వెళ్లిపోయిన కారణంగా ఐదు వేల మంది ఉపాధికి గండి పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ పాలనలో డిగ్రీ చదువుకున్న వారు ఆటోలు నడుపుకునే బ్రతుకుతున్నారని, యువత ను గంజాయి బాట పట్టించారని ఆరోపించారు. ఒక్కప్పుడు నిరుద్యోగం 18 శాతం ఉంటే ఇప్పుడు దానిని 24 శాతానికి తీసుకొచ్చారని, 99 అగ్రిమెంట్లు 13 లక్షల ఉద్యోగాలని చెప్పి ఇవ్వకుండా మాయ చేసారని ధ్వజమెత్తారు. ఒక్క జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, మద్యం, ఇసుక, ఆదాయం మీద ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. యువత అర్థం చేసుకొని మొదటి ఓటు విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబుకు వేయాలని కోరారు. భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కోరాడ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
Read More..
టీడీపీ తొలి జాబితా విడుదల... మండలి బుద్ధ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి