రైతులపై కాల్పులు జరపడం అమానుషం..తక్షణమే హర్యానా సీఎం రాజీనామా చేయాలి..

by Jakkula Mamatha |
రైతులపై కాల్పులు జరపడం అమానుషం..తక్షణమే హర్యానా సీఎం రాజీనామా చేయాలి..
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతుల పై హర్యానా ప్రభుత్వం కాల్పులు జరిపించి శుభ్ కరణ్ సింగ్ అనే రైతును పెట్టుకున్నందుకు హర్యానా ముఖ్యమంత్రి ఎం ఎల్ కట్టర్, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.రైతులపై కాల్పులు, హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా నేడు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే జరిగింది. దీనిలో భాగంగా విశాఖ జిల్లాలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బ్లాక్ డే కార్యక్రమం జరిగింది.

కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు,ఎ.ఐ.టి.యు.సి జిల్లా కార్యదర్శి టి.అచ్యుతరావు ,ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కే. శంకర్రావు, ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి కె ఈశ్వరరావు మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలంటే రైతులు సుభిక్షంగా ఉండాలని అన్నారు. దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతులు అప్పులు ,అవమానాల పాలై ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నేడు దేశంలో నెలకొనడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ విధానాలే కారణమన్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల ధరలు విపరీతంగా పెరిగాయని వాటిపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ లకు భారీగా కోత పెట్టిందని, దీనివల్ల రైతులు పంటకు పెట్టుబడి పెరిగి గిట్టుబాటు ధర రాక రైతులు దివాలా తీస్తున్నారు అన్నారు.

Advertisement

Next Story

Most Viewed