AP Politics:తమ ప్రభుత్వంలో వేధింపులు ఉండవు:సీఎం రమేష్

by Jakkula Mamatha |
AP Politics:తమ ప్రభుత్వంలో వేధింపులు ఉండవు:సీఎం రమేష్
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి వేధింపుల నుంచి బయట పడవలసిందిగా అనకాపల్లి లోక్‌సభ ఎన్నికల్లో కూటమి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత సీఎం రమేష్ కోరారు. గురువారం ఉదయం ఆయన కూటమి అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో కలిసి అనకాపల్లి గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. వారి ఉద్దేశించి రమేష్ మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యాపారులు తీవ్ర వేధింపులకు గురయ్యారని, అధికారులతో పాటు వైసీపీ నేతలు కూడా తీవ్రంగా వేధించారని చెప్పారు.

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యాపారుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని, చట్ట ఉల్లంఘనలకు పాల్పడమని హామీ ఇచ్చారు. ఇటీవల చోడవరంలో వ్యాపారిపై జీఎస్టీ అధికారుల నిబంధనలకు విరుద్ధంగా దాడి చేస్తే వెంటనే స్పందించి అధికారులను ప్రశ్నించామని గుర్తుచేశారు. తమ ప్రభుత్వ విధానాలు నిజాయితీగా వ్యాపారం చేసే వ్యాపారులకు రక్షణగా ఉంటాయని స్పష్టం చేశారు. వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకొని వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా రాబోయే ప్రభుత్వం లో అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అనకాపల్లి అసెంబ్లీకి గ్లాసు గుర్తుపై పోటీ చేస్తున్న తనను, పార్లమెంటుకు కమలం గుర్తు పై పోటీ చేస్తున్న సీఎం రమేష్‌ను గెలిపించాల్సిందిగా కొణతాల విజ్ణప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed