విశాఖకు Cm Ys Jagan

by srinivas |   ( Updated:2023-01-27 12:03:52.0  )
విశాఖకు Cm Ys Jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 28న (శనివారం) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈమేరకు సీఎంవో షెడ్యూల్ విడుదల చేసింది. శనివారం ఉదయం 9.15 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠానికి ఉదయం 11 గంటలకు చేరుకుని వార్షికోత్సవ కార్యక్రమాలలో సీఎం జగన్ పాల్గొంటారని సీఎంవో తెలిపింది. మధ్యాహ్నం 12.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి అక్కయ్యపాలెం సాగరమాల కన్వెన్షన్‌ హాల్‌కు చేరుకుని అనకాపల్లి ఎంపీ సత్యవతి కుమారుడు డా.యశ్వంత్, డా.లీలా స్రవంతి దంపతులను ఆశీర్వదిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు రుషికొండ ఐటీ పార్క్‌ వద్ద విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి వెళ్తారు. అక్కడ ఎంపీ కుమారుడు శరత్‌ చౌదరి, జ్ఞానిత దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. అనంతరం 1.55 గంటలకు ఐపీఎస్‌ అధికారి విద్యాసాగర్‌ నాయుడు, భవ్య దంపతులను వారి నివాసంలో ఆశీర్వదించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని సీఎంవో ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇవి కూడా చదవండి: Tirumala: శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులు వాయిదా

Advertisement

Next Story