- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Visakha: బీజేపీకి రాజీనామా చేస్తున్నా: నాగ మల్లీశ్వరి
దిశ, ఉత్తరాంధ్ర: భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్చార్జ్ మంచా నాగమల్లీశ్వరి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నాలుగేళ్లుగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ వచ్చానని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలు నచ్చి కొంతమంది పెద్దల ఆహ్వానం మేరకు బిజెపిలోకి రావడం జరిగిందన్నారు. ఓడిపోతానని అనిపించినప్పటికీ కార్పొరేటర్‌గా పోటీ చేశానని, అనంతరం యువమోర్చాలో పని చేశానని చెప్పారు. ప్రస్తుతం ఎస్సీ మోర్చ ఉత్తర ఆంధ్ర జోనల్ ఇన్చార్జిగా ఉన్నానని పేర్కొన్నారు.
అయితే పదవులు ఆశించి బీజేపీలోకి రాలేదని, పార్టీని అడ్డుపెట్టుకుని ఎలాంటి లబ్ధి పొందలేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కింది స్థాయి నాయకులకు తగిన ప్రాధాన్యత లేకపోవడం బాధ అనిపించిందని చెప్పారు. తాను దళితులకు, మహిళలకు ఎలాంటి న్యాయం చేయలేనప్పుడు పార్టీలో ఉన్న లేకపోయినా ఒకటేనని అన్నారు. తనను నమ్మిన కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు ఇబ్బంది కలిగించకూడదన్న ఉద్దేశంతో బీజేపీకి, పదవికి రాజీనామా చేయడం జరిగిందని తెలిపారు. ఈ రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరికి అందజేయడం జరుగుతుందని చెప్పారు.