- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
శక్తివంచన లేకుండా కృషి చేస్తా: జీవీఎల్ నరసింహారావు
దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల భద్రతకు, ప్లాంట్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్‌తో ఎంపీ జీవీఎల్ నరసింహారావు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గంటకుపైగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రస్తుత పని తీరుని సమీక్షిస్తూ రానున్న నెలల్లో స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని పెంచడతోపాటు, లాభాల్లోకి తెచ్చే విధంగా చేయవల్సిన అన్ని ప్రయత్నాల గురించి విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంలో స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ కొత్తగా ముడిసరుకు వర్కింగ్ క్యాపిటల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఈవోఐతో సహా మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నాలకుగానూ జీవీఎల్‌కు సీఎండీ ధన్యవాదాలు తెలిపారు.
ఇకపోతే జీవీఎల్ నరసింహారావు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న వర్కింగ్ క్యాపిటల్, ముడిసరుకు మొదలగు విషయాలపై ఉద్యోగులకు సంబంధించిన చాలా అంశాలపై పార్లమెంటులో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అంతేకాదు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి జ్యోతి రాధిత్య సింధియా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలతో సైతం పలుమార్లు భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారాన్ని సఫలీకృతం చేసేందుకు జీవీఎల్ వరుస భేటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు గతంలో మూడు పర్యాయాలు స్టీల్ ప్లాంట్‌లోని అన్నీ ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించిన జీవీఎల్ వారి ఉద్యోగ భద్రతకు, ప్లాంట్ అభివృద్ధికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read..