ఎన్నికల వేళ అభ్యర్థులకు గండం.. ఇందులో వెనుకబడితే సీటు గల్లంతేనా?

by Jakkula Mamatha |   ( Updated:2024-03-29 09:20:10.0  )
ఎన్నికల వేళ అభ్యర్థులకు గండం.. ఇందులో వెనుకబడితే సీటు గల్లంతేనా?
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:తిమ్మిని బమ్మిని చేసి,అధిష్టానాన్ని ఒప్పించి టికెట్ తెచ్చేసుకొన్న కూటమి అభ్యర్దలకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్సాన్స్ సిస్టమ్(ఐవీఆర్ఎస్ )వెన్నులో వణుకు పుట్టిస్తోంది.టికెట్ తమదే అనే ధీమాతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్న, వివాదాలు రాజేస్తున్న వారిపై తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా ఐవీఆర్ఎస్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి.ఐవీఆర్ఎస్ లో వెనుక బడిన అభ్యర్థుల స్థానంలో కొత్త అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉండడంతో పలువురు భయపడుతున్నారు. తాజాగా గురువారం అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని యలమంచలి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ పై నిర్వహించిన ఐవీఆర్ ఎస్ సర్వే ఫలితం వ్యతిరేకంగా వచ్చిందని విశ్వసనీయంగా తెలిసింది.

ఏమీటీ ఐవీఆర్ఎస్..?

ఆ విధానంలో నియోజకవర్గంలోని ఎంపిక చేసిన ఫోన్ నెంబర్ కు వాయిస్ మెసేజ్ వస్తుంది. ఫలానా అభ్యర్ది మీకు కావాలా? వద్దా? అంటూ ప్రశ్నలు ఉంటాయి. సమాధానంగా ఒకటి, రెండు , మూడు అంకెల మీద నొక్కమని చెబుతుంది. ఆ సందేశాన్ని అవసరాన్ని బట్టి పార్టీ కార్యకర్తలకు లేదా నియోజకవర్గంలోని ఓటర్లకు ,ముఖ్యులకు పంపుతారు.పంపించిన వ్యక్తికి వెంటనే ఫలితం తెలిసిపోతుంది. వేయి మంది కి సందేశం పంపి 600 మంది సమాధానం చెబితే అందులో ఎందరు కావాలన్నారు? ఎందరు వద్దన్నారు? అన్న విషయం వెంటనే తెలిసిపోతుంది.ఇలా సేకరించిన ప్రజాభిప్రాయం ద్వారా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది.

పొత్తులో భాగంగా జననసేనకు కేటాయించిన అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అభ్యర్దిగా ప్రకటించిన సుందరపు విజయ్ కుమార్ పై పలు వివాదాలు ఉన్నాయి. గతంలో సుందరపు విజయ్ కుమార్ నియోజక వర్గానికి చెందిన జనసేన మత్స్యకార నేత ఏరిపల్లి కిరణ్ ను విశాఖ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతల సమక్షంలో తీవ్రంగా కొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడైన కిరణ్ ను స్వయంగా పవన్ కళ్యాణ్ పిలిపించుకొని మాట్లాడి క్షమాపణ చెప్పమని విజయ్ కుమార్ ను ఆదేశించిన ఫలితం లేకపోయింది. ఇదే తరహాలో నియోజక వర్గంలో పలువురితో వివాదాలున్నాయి.టీడీపీ క్యాడర్ విజయ్ కుమార్ తో కలిసి పనిచేయడానికి విముఖత చూపుతోంది. ఆ నేపథ్యంలో ఆయన పై ఐవీఆర్ఎస్ నిర్వహించారు.పవన్ కళ్యాణ్ గొంతుతో మీకు జనసేన అభ్యర్దిగా విజయ కుమార్ కావాలా? వద్దా? అని వాయిస్ మెసేజ్ పంపి సమాధానాలు రాబట్టారు.

యలమంచలి మారితే పెందుర్తి మారుతుందా?

ఒక వేళ ఐవీఆర్ఎస్ లో వ్యతిరేకత కారణంగా యలమంచలి లో విజయ్ కుమార్ కు టికెట్ నిరాకరిస్తే జనసేన అనకాపల్లి పార్లమెంటు తో తీసుకొన్న మరో స్ధానం పెందుర్తిలో అభ్యర్ధి మార్పు తప్పకపోవచ్చని అంటున్నారు.పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబును యలమంచలికి మార్చి పెందుర్తిని తెలుగుదేశం పార్టీకి వదిలేసి ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. 2014 ఎన్నికల్లో రమేష్ బాబు యలమంచలి టీడీపీ అభ్యర్ధిగా ఘన విజయం సాధించారు. 2019లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Read More..

మరో సేనను స్థాపించిన హరిరామ జోగయ్య

Advertisement

Next Story

Most Viewed