- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Visakha: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలి...!
దిశ, ఉత్తరాంధ్ర: స్థానిక నిరుద్యోగ యువతకు ప్రభుత్వ రంగ సంస్థల్లో 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే ఉన్నత పాఠశాలలలో కాంపోజిట్ సంస్కృతం సబ్జెక్టును కొనసాగించాలని కోరారు. మంత్రి బొత్స సత్యనారాయణకి కూడా ఈ వినతి పత్రాన్ని వాట్సప్ ద్వారా అందజేశారు. ఆర్టికల్ 371 డి ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో స్థానికులకు 75 శాతం ఉద్యోగ కల్పనలో రిజర్వేషన్ కల్పించవలసిన అవసరం ఉందని హేమంత్ గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ తరువాత ఉత్తరాంధ్రకు భారీ ప్రాజెక్టు రాలేదని, నిరుద్యోగులు పెరుగుతున్నారని, స్థానికులకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలన్నారు. గిరిజన విశ్వవిద్యాలయంతో ప్రారంభిస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా వ్యాప్తి చెందేలా చూడాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి స్థానికంగా భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.