- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Politics:ఏపీలో 30 అసెంబ్లీ, ఆరు ఎంపీ సీట్లు సాధిస్తాం..కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
దిశ ప్రతినిధి,విశాఖపట్నం: ఏపీలో 30 అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లు సాధించి, ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి చెప్పారు. విశాఖలో గురువారం పార్టీ నగర అధ్యక్షుడు గొంప గోవిందు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ వాసిగా, విద్యార్థి నాయకుడిగా తనకు ఎంపీ అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యలో పోరాటాల పురిటిగడ్డ విశాఖ నేపథ్యాన్ని ఉక్కు సత్యాగ్రహం సినిమా తీశానని తెలిపారు.
తెలుగు సేన పార్టీ స్థాపించి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పోరాటాలు చేశానని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు భూ నిర్వాసితుల కోసం తుదికంటా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. రైల్వే జోన్, పోలవరం, ప్రత్యేక హెోదా తరఫున పోరాటం చేస్తామని, రాహుల్ ప్రధాని చేస్తామన్నారు. గాజువాక, విశాఖ దక్షిణ, తూర్పు, భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థులు రామరావు, వి.సంతోష్, గుత్తుల శ్రీనివాస్, కాశీ వర్మ తదితరులు మాట్లాడుతూ అధికార వైసీపీ, కూటమి అభ్యర్థుల దురాగతాలను ఎండగట్టారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. తమను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.