మంత్రి నారా లోకేష్‌ని కలిసిన ఏఐఎస్ఎఫ్ బృందం

by Jakkula Mamatha |
మంత్రి నారా లోకేష్‌ని కలిసిన ఏఐఎస్ఎఫ్ బృందం
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు కలిసి సమస్యల పై వివిధ పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి యు.నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు సరైన మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులకు నెలవారి ఖర్చులకు ఇచ్చే కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలని, శాశ్వత వసతి భవనాలు కేటాయించాలని అలాగే ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని ప్రతి విద్యార్థిని, విద్యార్థికి 2500 ఇవ్వాలనీ పెండింగ్‌లో ఉన్న మెస్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని తెలిపారు.

యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేసి ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చే విధంగా చూడాలని నారా లోకేష్ గారిని కోరడం జరిగిందన్నారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ గారు స్పందించి గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిందని ఏది ఏమైనప్పటికీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎన్ శ్రీను, జిల్లా సమితి సభ్యులు, శేఖర్, దిలీప్ పాల్గొన్నారు.

Advertisement

Next Story