అల్లూరి జిల్లాలో భారీ వర్షం.. రైల్వే ట్రాక్‌పై కూలిన చెట్టు

by srinivas |   ( Updated:2024-07-21 17:30:35.0  )
అల్లూరి జిల్లాలో భారీ వర్షం.. రైల్వే ట్రాక్‌పై కూలిన చెట్టు
X

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో వాగులు, వంకలు పొంగిపొరల. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ స్తంభాలు, వృక్షాలు కూలిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల ఇళ్లు పడిపోయాయి. మరికొన్ని చోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా జిల్లాలోని బొర్రా గుహలు-కరకవలస స్టేషన్ల మధ్య కేకే లైన్‌లో రైల్వే ట్రాక్‌పై భారీ వృక్షం పడింది. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది చెట్టును తొలగిస్తున్నారు. దీంతో పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నాయి.

Advertisement

Next Story