Visakha: బీచ్ రోడ్‌లో కారు బీభత్సం.. యువకుడు దుర్మరణం

by srinivas |
Visakha: బీచ్ రోడ్‌లో కారు బీభత్సం.. యువకుడు దుర్మరణం
X

దిశ, ఉత్తరాంధ్ర: డ్రంక్ అండ్ డ్రైవ్, మత్తు పదార్థాలు, లైసెన్సులు లేని యువతే విశాఖలో జరుగుతున్న ప్రమాదాల్లో మృత్యువాత పడుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు ఎన్ని డ్రైవ్‌లు నిర్వహించినా ప్రమాదాలు మాత్రం షరా మామూలే అవుతున్నాయి. పైగా 80 శాతం మంది మైనర్లే వాహనాల డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. మొన్న రెడ్సన్ బ్లూ కారు ఘటన మరవకముందే శనివారం ఐ.ఎన్.ఎస్ కళింగ వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఓ యువకుడు అతి వేగంగా కారు నడపడంతో అది అదుపుతప్పి చెట్టు ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. కారులో ఉన్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన యువకుడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే మైనర్లు వాహనాలు నడిపినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా, మత్తు పదార్థాలు సేవికఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed