- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్పా ముసుగులో పాడు పనులు.. ఉక్కుపాదం మోపిన పోలీసులు
దిశ, వెబ్ డెస్క్: విశాఖలో స్పా ముసుగులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో పోలీసులు తనిఖీలు చేశారు. మొత్తం 71 స్పా సెంటర్లలో సోదాలు చేపట్టారు. 21 స్పా సెంటర్లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు. 2 స్పా సెంటర్లను సీజ్ చేశారు. స్పా సెంటర్లలో డ్రగ్స్, గంజాయి వినియోగం జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ద్వారకానగర్‌లోని కాక్ టైల్ తాయ్ స్పాతో పాటు నిర్విన్ డే స్పాను సీజ్ చేశారు. మరో 21 స్పాలకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ స్పాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.
కాగా విశాఖ పరిధిలో 200లకు పైగా తాయ్ స్పాలతో పాటు సాధారణ మసాజ్ సెంటర్లు ఉన్నాయి. విశాఖకు వచ్చే పర్యాటకులు, కార్పొరేట్ అవసరాలకు వచ్చిన వారినే టార్గెట్ చేస్తున్నారు. క్రాస్ మసాజులతో పాటు అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వెల్‌నెస్ సెంటర్ల పేరుతో మసాజ్ కేంద్రాలు నడుపుతున్నారు. పోలీసుల సోదాల్లో ఆరుగురు మహిళలతో పాటు పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో మరిన్ని తనిఖీలు నిర్వహిస్తామని పోలీసులు హెచ్చరించారు.