Breaking: రేపు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు

by srinivas |   ( Updated:2024-09-08 13:38:21.0  )
Breaking: రేపు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. పశ్చిమ మధ్య వాయువ్య దిశగా కదులుతోంది. సోమవారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారి, రాత్రికి ఒడిశా-పశ్చిమబెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. వర్షం కారణంగా విద్యార్థులు బయటకు రావొద్దని, ఇళ్లలోనే ఉండాలని సూచించారు. పరిస్థితిని బట్టి మంగళవారం నుంచి స్కూళ్లు యథావిథిగా తెరుచుకుంటాయని పేర్కొన్నారు.

అటు ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని, సహాయ చర్యల కోసం విశాఖ కలెక్టరేట్‌లో సైక్లోన్‌ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పోలీసు, తహసీల్దార్‌ కార్యాలయాల్లోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలకు ఎలాంటి సహకారం కావాలన్నా విశాఖ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ 0891-2590102, 0891-2590100, పోలీసు కంట్రోల్‌ రూమ్‌ 0891-2565454, డయల్‌ 100, 112, పెదగంట్యాడ తహసీల్దార్ 9948821997, గాజువాక 8886471113, ఆనందపురం 9700501860, భీమిలి 9703888838, పద్మనాభం 7569340226, చినగదిలి 9703124082, పెందుర్తి 7702577311, సీతమ్మధార 9182807140, గోపాలపట్నం తహసీల్దార్‌ 7842717183, ములగాడ 9440552007కు సంప్రదించాలని అధికారులు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed