24 గంటల్లో వర్షాలు.. కోస్తాంధ్రకు బిగ్ అలర్ట్

by srinivas |
24 గంటల్లో వర్షాలు.. కోస్తాంధ్రకు బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరకోస్తాకు విశాఖ వాతావరణ శాఖ (Visakha Cyclone Warning Center) అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. బంగాళాఖాతం(Bay of Bengal)లో అల్పపీడనం ఏర్పడిందని, రుతపవన ద్రోణి (Monsoon Basin) ప్రభావంతో ఉపరితల ఆవర్తనం ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh), మహారాష్ట్ర(Maharashtra) మీదుగా కొనసాగుతోందని తెలిపారు. దీని వల్ల రానున్న 24 గంటల్లో తేలిక పాటి వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు.ఈ కారణంగా మత్య్సకారులు(Fishermen) వేటకు వెళ్లొద్దని సూచించారు. తీరం వెంబడి భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు, పశువులకాపరులు చెట్ల కిందకు వెళ్లొద్దని, పిడుగులు పడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed