- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
త్వరలో విశాఖలో ఎన్నికలు.. తాడేపల్లికి 45 మంది కార్పొరేటర్లు
దిశ, వెబ్ డెస్క్: విశాఖ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో జీవీఎంసీపై వైసీపీ జెండా ఎగురువేసింది. వైసీపీ కార్పొరేటర్ల మెజార్టీతో మేయర్ పదవిని దక్కించుకుంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. దీంతో జీవీఎంసీపై ఎలాగైనా సరే కూటమి ప్రభుత్వం జెండా ఎగురవేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పలువురు వైసీపీ కార్పొరేటర్లను కూటమిలో చేర్చుకునేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరారు. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మేజిక్ ఫికర్ దక్కించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కూటమికి మరికొంతమంది కార్పొరేటర్ల మద్దతు కావాల్సిన అవసరం ఉంది.
దీంతో వైసీపీ అధినేత జగన్ అలర్ట్ అయ్యారు. వైసీపీ కార్పొరేటర్లు చేజారకుండా చూసుకుంటున్నారు. ఇందులో భాగంగా విశాఖ వైసీపీ కార్పొరేటర్లకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్పొరేటర్లు వెళ్లిపోకుండా చేసుకోవాల్సిన బాధ్యతను పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డికి అప్పగించారు. దీంతో కార్పొరేటర్లతో వారిద్దరూ నిరంతరం టచ్‌లో ఉంటున్నారు.
ఇదిలా ఉంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికలపై వైసీపీ హైకమాండ్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా జీవీఎంసీ కార్పొరేటర్లు తాడేపల్లి జగన్ క్యాంపు కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ మేరకు 45 మంది వైసీపీ కార్పొరేటర్లు విశాఖ నుంచి తాడేపల్లి వెళ్లారు. అనంతరం జగన్‌ను కలిశారు. ఎమ్మెల్సీ, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శుక్రవారం దిశానిర్దేశం చేయనున్నారు.