చలో విజయవాడ టెన్షన్ టెన్షన్.. మొహరించిన పోలీసులు

by Disha News Desk |
చలో విజయవాడ టెన్షన్ టెన్షన్.. మొహరించిన పోలీసులు
X

దిశ, ఏపీ బ్యూరో : పీఆర్సీ సాధన సమితి చలో విజయవాడకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 3న చలో విజయవాడ నిర్వహించాలని పీఆర్సీ సాధన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. అంతేకాదు దీన్ని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. చలో విజయవాడకు ఎలాంటి అనుమతులు లేవని సీపీ క్రాంతిరాణా టాటా తెలిపారు. ఈ నేపథ్యంలో విజయవాడకు వెళ్లే వివిధ మార్గాల్లో పోలీసులు భారీగా మోహ‌రించారు. దీంతో అనంత‌పురం నుంచి విజ‌య‌వాడ‌కు వెళ్లే మార్గంలో పోలీసులు మోహ‌రించారు. ఆయా మార్గాల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి త‌నిఖీలు నిర్వహించారు.

బుక్క‌రాయ స‌ముద్రం, నార్ప‌ల‌ క్రాస్ వ‌ద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. మరోవైపు హిందూపురంలో ఎన్జీవో నేత న‌ర‌సింహులును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. క‌డ‌ప నుంచి విజ‌య‌వాడ‌కు వెళ్ల‌కుండా ఉద్యోగ సంఘాల ముఖ్య నేత‌ల ఇళ్ల వ‌ద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఒంగోలులో ఎన్జీవో జిల్లా అధ్య‌క్షుడు శ‌ర‌త్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లాలో నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు, వాకాడు, వ‌రికుంట‌పాడులో ఉద్యోగుల‌ను పోలీసులు ముంద‌స్తు అరెస్టు చేశారు. మరోవైపు ప‌లువురు ఉద్యోగ సంఘాల నేత‌లు గ‌త అర్ధ‌రాత్రి నుంచే విజ‌య‌వాడ‌కు బ‌య‌లుదేరారు.

Advertisement

Next Story

Most Viewed