- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖలో రూ.300కోట్ల భూమిని కొట్టేసేందుకు విజయసాయిరెడ్డి స్కెచ్: అయ్యన్నపాత్రుడు
దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్నంలో ఏ2 విజయసాయిరెడ్డికి, భీమునిపట్నం ప్రాంతంలో రూ.300 కోట్ల విలువైన తుర్లవాడ కొండ భూమిని కట్టబెట్టేందుకు జగన్ ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు. దేవుడి పాదాలు ఉన్నాయంటూ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచే తుర్లవాడ కొండను కబ్జా చేసేందుకు విజయసాయిరెడ్డి అతని గ్యాంగ్ సిద్ధమైంది అని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. రెండ్రోజుల క్రితం ఏ2 కొండను పరిశీలించడానికి వెళ్లినప్పటి నుంచి స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు. తుర్లవాడ కొండపై విజయసాయిరెడ్డి కూతురు ప్రైవేట్ యూనివర్శిటీ కడుతుందని, కాబట్టి దానిపై 120ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు అని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. సదరు దరఖాస్తుపై అధికారయంత్రాంగం ఆఘమేఘాలపై స్పందించి, చకచకా ఫైల్ సిద్ధంచేసి, ముఖ్యమంత్రి ఎదుట ఉంచింది అని చెప్పుకొచ్చారు. విశాఖపట్నం సమీపంలో ఉన్న ఆ కొండ భూమి ఎకరం ధర రూ.2 నుంచి రూ.3కోట్లు ఉంటుంది. 120 ఎకరాలు రూ.300 కోట్లవరకు విలువ ఉంటే, కేవలం రూ.20కోట్ల నామమాత్రపు ధరకే జగన్ రెడ్డి దాన్ని ఏ2కు కట్టబెట్టడానికి సిద్ధమయ్యాడు అని ఆరోపించారు. నాలుగున్నరేళ్ల నుంచి రాష్ట్రంలో ఎక్కడా, దేన్ని వదలకుండా దోచుకున్న జగన్ రెడ్డి, అతని అనుమాయులు ఇంకా అక్కడక్కడ మిగి లిన ఇలాంటి విలువైన భూముల్ని కూడా కాజేసేందుకు సిద్ధమయ్యారు అని ఆరోపించారు. తుర్లవాడ కొండపై నరసింహస్వామి నడయాడారని అలాంటి పవిత్రమైన కొండను ఏ2కు ధారాధత్తం చేయడానికి సిద్ధపడిన జగన్ రెడ్డికి సిగ్గుందా అని చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.
70వేల కోట్లు విలువ చేసే భూములు కొట్టేశారు
విశాఖపట్నంలో విజయసాయి, జగన్ రెడ్డి ఇప్పటికే వేల ఎకరాల ప్రభుత్వభూములు కాజేశారు అని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టిరూ.25వేలకోట్ల అప్పులు తెచ్చారన్నారు. రాష్ట్రంలో దాదాపు 40వేల ఎకరాల దేవాదాయభూమి క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని దేవాదాయ శాఖ మంత్రి చెబుతున్నాడు. మంత్రిగా ఉండి రికార్డుల్లో ఉన్నభూమి ఫీల్డ్ లో లేదని చెప్పడానికి సిగ్గుందా అని నిలదీశారు. ప్రభుత్వ ఆస్తులంటే తనతండ్రి సంపాదించిన ఆస్తులని జగన్ భావిస్తున్నాడా? దసపల్లా భూములు, కార్తీక వనం, బేపార్క్, ఎన్.సీ.సీ., రామానాయుడు స్టూడియో, భోగాపురం భూములు అప్పనంగా ప్రజల్ని భయపెట్టి లాక్కున్నారు అని మండిపడ్డారు. అవన్నీ కలిపితే వాటివిలువ దాదాపు రూ.70వేలకోట్లు ఉంటుంది. వాటితోపాటు రుషికొండను స్వాహాచేశారు. రుషికొండపై ముఖ్యమంత్రి నివాసం కడితే తప్పేముందని మంత్రి రోజా మాట్లాడటం ఆమె బుద్ధి మాంద్యానికి నిదర్శనం అని ధ్వజమెత్తారు. రుషికొండ విశాఖపట్నం మహానగరానికి రక్షణ కవచం లాంటిది. హుద్ హుద్ తుఫాన్ ప్రభావం గతంలో రుషికొండను తాకి వెనక్కు మళ్లింది. ఆ తుఫాన్ నుంచి విశాఖన గరాన్ని రుషికొండే కాపాడింది అని అయ్యన్న చెప్పుకొచ్చారు. ఈ దోపిడీపై విశాఖ మహానగరంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై మేథావులు, ప్రజాసంఘాలు స్పందించాలి అని విజ్ఞప్తి చేశారు. న్యాయస్థానాలు, ఎన్జీటీని కాదని, ప్రజాభీష్టానికి విరుద్ధంగా ముఖ్యమం త్రి నివాసం ముసుగులో రుషికొండపై నిర్మించే నిర్మాణాలను టీడీపీ ప్రభుత్వం రాగానే ప్రజావసరాలకు, పర్యాటకశాఖకు కేటాయిస్తాం అని చెప్పుకొచ్చారు. అలానే విజయ సాయిరెడ్డి, జగన్ రెడ్డిల దోపిడీని ఆధారాలతోసహా ప్రజలముందు ఉంచుతాం అని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు.
విజయసాయి, జగన్ ఇద్దరూ తోడుదొంగలు
సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిలు ఇద్దరూ తోడుదొంగలు అని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. గతంలో ఏస్థాయిలో ప్రజల సొమ్ము కాజేశారో అందరికీ తెలుసునన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి ఎంతదోచేశారో, ఎన్నివేల ఎకరాల భూములు దిగమింగారో అంతా బయటపెట్టి, ఇద్దరు తోడుదొంగల్ని శిక్షిస్తాం అని హెచ్చరించారు. లక్షల కోట్ల సంపదను ఏంచేసుకుంటాడో జగన్ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. తండ్రి అధికారంతో పాటు, తన ముఖ్యమంత్రిత్వంలో దోచేసిన ప్రజలసొమ్ము అంతా కలిపితే దాదాపు రూ. 3 లక్షల కోట్లకు పైనే ఉంది. జగన్ రెడ్డి పెద్ద ఆర్థిక ఉగ్రవాది... ధనపిశాచి అని ప్రజలే అంటున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి, భావితరాల భవిష్యత్ కు నష్టం జరుగుతున్నప్పుడు, ప్రజలు స్పందించకపోతే, దోపిడీదొంగలు, దుర్మార్గులు ఇష్టానుసారం పేట్రేగిపోతారు అని అయ్యన్నపాత్రుడు చెప్పుకొచ్చారు.