- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పరకామణిలో చోరికి పాల్పతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు
దిశ, తిరుపతి: తిరుమలలోని నూతన పరకామణి మండపంలో కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు, సిసి కెమరాల నిఘా ఏర్పాటు చేయడంతో అక్రమాలకు పాల్పడే వారిని విజిలెన్స్ అధికారులు ఇట్టే గుర్తిస్తున్నారు. ఆదివారం నోట్ల లెక్కింపు సమయంలో కొన్ని విదేశీ నోట్లను మలమార్గం వద్ద ఉంచుకుని బయటకు వెళుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని సిసి కెమెరాల ద్వారా గుర్తించి విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తనిఖీల్లో నోట్లను గుర్తించి వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. నూతన పరకామణి మండపంలో కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు చెయ్యడం అడుగడుగునా సిసి కెమెరాల నిఘా ఉంచడంతో ప్రతి ఒక్కరి కదలికపై సూక్ష్మ స్థాయిలో నిఘా ఉంచుతున్నారు.
గతంలోను ఇలాంటి ఘటనలు జరిగినా వెంటనే గుర్తించే వెసులుబాటు ఉండేది కాదు . నూతన పరకామణి మండపంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన భధ్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో స్వామి సేవ కోసం వచ్చి, చోరీకి పాల్పడుతున్న వారిని వెంటనే గుర్తించగలుగుతున్నారు. భవిష్యత్త్‌లో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతుందని భధ్రతాధికారులు స్పష్టం చేశారు.