తిరుమలలో వీడియో కలకలం.. మొబైల్‌తో భక్తుడు లోనికి వెళ్లడంపై అనుమానాలు..

by Rajesh |
తిరుమలలో వీడియో కలకలం.. మొబైల్‌తో భక్తుడు లోనికి వెళ్లడంపై అనుమానాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో ఓ భక్తుడు ఆలయంలో వీడియో తీయడం కలకలం రేపింది. తిరుమల ఆలయ ఆనంద నిలయాన్ని భక్తుడు వీడియో తీశాడు. రాత్రి వర్షం పడుతున్న సమయంలో మొబైల్ ఫోన్‌తో భక్తుడు వీడియో తీశాడు. మొబైల్‌తో ఆలయంలోకి వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల ఓ వ్యక్తి డ్రోన్‌తో ఆలయం వద్ద వీడియో తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. అయితే ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి వస్తువులు ఎగరడానికి అనుమతి లేదు. ఆలయంలో ఎలాంటి వీడియోలు తీసేందుకు సైతం అనుమతి లేదు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story

Most Viewed