- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సి.ఎస్, ఎస్.ఈసీ.లకు టీడీపీ ప్రముఖ నేత లేఖ.. కారణం ఇదే..!?
దిశ వెబ్ డెస్క్: తాజాగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పెన్షన్ల పంపిణీ వ్యవహారంపై సి.ఎస్ మరియు ఎస్.ఈసీ.లకు లేఖ రాసారు. పెన్షన్లు ఇంటి వద్దకే తీసుకెళ్లి పంపిణీ చెయ్యాలని టీడీపీ పలుమార్లు అభ్యర్ధిచిందని పేర్కొన్నారు. టీడీపీ అభ్యర్ధనను ఖాతరు చెయ్యకుండా వైసీపీ ప్రభుత్వం సచివాలయాల్లోనే పెన్షన్ల పంపిణీ జరగాలని మెమో విడుదల చేయడం దుర్మార్గమని లేఖలో వెల్లడించారు.
తీవ్రమైన ఎండల కారణంగా లబ్దిదారులు ఇబ్బందులు పడతారన్న కనీస ఇంగితం కూడా లేకుండా ఇలాంటి మెమోలు జారీ చేయడం ఏంటని ప్రశ్నించారు. అలానే సచివాలయ సిబ్బందికి పెన్షన్ల నగదు ఇవ్వకుండానే.. పెన్షన్ల పంపిణీ మాత్రం ఉదయం 9 గంటలకే ప్రారంభమౌతుందని లబ్దిదారులు చెప్పడం వాళ్ళను ఇబ్బందులకు గురిచేయడం కాదా? అని లేఖ ద్వారా ప్రశ్నించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను ఖాతరు చేయకుండా.. పెన్షన్ లబ్దిదారులను తీవ్ర ఎండల్లో నిలబెట్టి ఇబ్బందులకు గురిచేయడం అధికారుల అమానుషత్వానికి నిలువెత్తు నిదర్శనం అని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ స్వలాభం కోసం పెన్షన్‌దారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. ఆ తప్పును ప్రతిపక్షాలపై నెట్టాలని వైసీపీ నాయకులు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వయో వృద్ధులను మంచాలపై వైసీపీ కార్యకర్తలు •తీసుకొస్తూ వీడియోలు తీసి వాటిని ప్రచారమాధ్యమాల్లో విడుదల చేసి ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వయో వృద్దులకు, వ్యాధిగ్రస్తులకు పెన్షన్ డబ్బులు వారి వద్దకే జిల్లా కలెక్టర్లు తీసుకెళ్లి ఇవ్వాలని ప్రభుత్వం ఏప్రిల్ 2, 2024 న ఆదేశాలు జారీ చేసిందని.. కానీ వైసీపీ ఆ ఆదేశాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందని తెలిపారు.
ఇప్పటికైనా సచివాలయ సిబ్బంది ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దకే పెన్షన్ నగదు తీసుకెళ్లి ఇవ్వాలని, వైసీపీ కార్యకర్తలు, నాయకులు చేసే నీచపు ప్రచారాన్ని అరికట్టాలని కోరుతున్నామన్నారు. పెన్షన్లు ఇంటి వద్దకే తీసుకొచ్చి ఇచ్చేలా నిధులు వెంటనే సచివాలయ సిబ్బందికి అందించాలని, అలానే పెన్షన్లు ఇంటి వద్దకే తెచ్చిస్తామనే విషయాన్ని మీడియా ద్వారా లబ్దిదారులకు తెలియజేయాలని లేఖ ద్వారా కోరారు.