- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెల్లి ప్రశ్నకు సమాధానం చెప్పలేని అన్న..తప్పు ఒప్పుకున్నట్టేనా?టీడీపీ
దిశ డైనమిక్ బ్యూరో: ఈ రోజు టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వివేకా హత్యా కేసులో వైఎస్ సునీత ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డా. సునీత అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పకుండా తప్పుకునే అవకాశం లేదని తెలిపారు.
సునీత ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పుకుంటే తప్పుడోడు అవుతాడు అంటూ సునీత ప్రశ్నలు సంధించింది అని తెలిపారు. ఇక చెల్లి ప్రశ్నించింది.. అన్న సమాధానం చెబుతాడని ప్రతిపక్షమైన తాము మౌనంగా ఉన్నామని పేర్కొన్నారు. అయితే మధ్యలో కేతిగాడు ఒకడు ఎంటర్ అయ్యాడని సజ్జల రామకృష్ణారెడ్డిని ఎద్దేవ చేశారు.
సునీతను చంద్రబాబు రెచ్చగొట్టి పంపుతున్నారని సజ్జల అన్నారని.. అందుకే తాను మాట్లాడుతున్నాని తెలిపారు. ఇప్పుడు తాను అడుగుతున్నా.. మీ చెల్లి డా. సునీత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేరని ఎద్దేవ చేశారు. మా అన్న లాంటి వాడు అధికారంలో ఉండడానికి వీలు లేదని సునీత అన్నారని రామయ్య పేర్కొన్నారు.
రానున్న ఎన్నికల్లో మా అన్నకు ఓటు వేయొద్దు.. గోరంగా ఓడించండి అని సొంత చెల్లెలు అన్నారని.. ఆమె మాటలకు సమాధానం చెప్పండి జగన్ అని డిమాండ్ చేశారు. నేను ఏం చేసాను ఎందుకు అలా అంటున్నావమ్మా అని అడిగే దైర్యం మీకు ఉందా జగన్ అని ప్రశ్నించారు. అలానే నాన్న చనిపోయిన తరువాత గొడ్డలి వేటుతోనే చనిపోయారని ఎవరికీ తెలియక ముందే మీకు ఎలా తెలిసింది అని సునీత ప్రశ్నించింది.
ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి జగన్ అని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకా హత్యా కేసు గురించి సిబిఐ విచారణకు హైకోర్టులో వేసిన పిటీషన్ ను.. మీరు అధికారంలోకి వచ్చాక ఎందుకు వెనక్కి తీసుకున్నారని సునీత అడిగింది.. సమాధానం చెప్పగలరా జగన్ అని ప్రశ్నించారు.
Read More..
మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద జేడీ లక్ష్మీనారాయణ గాంధీగిరి (మీరే చూడండి..)