- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయనవి దింపుడు కళ్లెం ఆశలే.. జనేసేనానికి వంగా గీతా కౌంటర్
దిశ వెబ్ డెస్క్: ఎన్నికల సమయం దగ్గర పడుతన్న నేపథ్యంలో నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. నిన్న పిఠాపురంలో పోటీ చేసే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వంగా గీతపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వంగా గీత 2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి గెలుపొందారని.. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆమె వైసీపీని వీడి జనసేనలోకి రావాలని ఆశిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
అయితే తాజాగా పవన కళ్యాణ్ వ్యాఖ్యలపై కాకినాడ ఎంపీ, వైసీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత స్పందించారు. తాను కూడా పవన్‌ను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? అని ప్రసవించారు. తాను 2009 కంటే ముందు నుంచే రాజకీయాల్లో ఉన్నానని పేర్కొన్నారు.
ఇక 2009లో చిరంజీవి తనకి అవకాశం కల్పించారని.. ప్రజల ఆదరాభిమానాలతో తాను గెలుపొందినట్లు వెల్లడించారు. ఇప్పుడు కూడా నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు తనకే ఉందని పేర్కొన్నారు.
ఇక పిఠాపురంలో గెలుపుపై పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలే అని ఎద్దేవ చేశారు. ఓ వైపు పవన్ వ్యాఖ్యలకు గీత కౌంటర్ ఇస్తే.. మరో వైపు మాకినీడు శేషు కుమారిశేషు షాక్ ఇస్తున్నారు. నేడు శేషు కుమారి వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నారని.. సీఎం జగన్ సమక్షంలోనే ఆమె వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం.
Read More: పవన్‌ను YCPలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది..? వంగా గీత