- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరద సహాయక చర్యలు అద్భుతం.. చంద్రబాబుపై శివరాజ్ సింగ్ చౌహన్ ప్రశంసలు
దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో (Vijayawada) వరద బాధితులకు అందిన సహాయ చర్యలపై కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ( Union Minister Sivaraj Singh Chouhan)హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) టీమ్ అద్భుతంగా పని చేసిందని ఆయన ప్రశంసలు కురిపించారు. విజయవాడ వరద (Flood) ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఒక్కసారిగా వచ్చిన వరదలతో విజయవాడ అతలాకుతలమైందన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చంద్రబాబు కృషి చేశారని తెలిపారు. ప్రభుత్వం అడిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ఎన్టీఆర్ఎఫ్, ఎయిర్ ఫోర్స్ బృందాలను పంపి కేంద్రం అండగా నిలిచిందని చెప్పారు. ప్రభుత్వం అప్రమత్తత, కృషితోనే ప్రాణ నష్టం తగ్గిందన్నారు. బుడమేరు పొంగడానికి అక్రమ మైనింగ్ కూడా ఓ కారణమని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వరదల దెబ్బకు లక్షకు పైగా హెక్టార్లలో పంట, 2 లక్షల మంది రైతులకు నష్టం జరిగిందన్నారు. వ్యాపారులు, సామాన్యులు సైతం చాలా నష్టపోయారని చెప్పారు. ప్రధాని మోడీ ఆదేశాలతో తాను ఏపీకి వచ్చానని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను (Pradhan Mantri Fasal Bima Yojana) జగన్ ప్రభుత్వం అమల చేయలేదని గుర్తు చేశారు. చంద్రబాబు సర్కార్ అమలు చేస్తోందని శివరాజ్ చౌహన్ తెలిపారు.