విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గని కేంద్రం.. కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-09-27 15:19:18.0  )
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గని కేంద్రం.. కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌(Visakha Steel Plant)పై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ(Union Minister Bhupathiraju Srinivas Varma) కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేస్తారని ప్రచారం జరుగుతున్న వేళ ఆయన స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందనుకోవద్దని చెప్పారు. సెయిల్(Sail), ఎన్ఎమ్‌డీసీ(NMDC)తో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదన ఉన్నా కొన్ని సాంకేతిక కారణాలున్నాయన్నారు. ఇతర మార్గాలపై దృష్టి పెట్టామని చెప్పారు. ప్లాంట్‌ను ఆదుకునేందుకే రూ. 500 కోట్లు కేటాయించామన్నారు. ఎన్ఎమ్‌డీసీకి ప్లాంట్ భూములు అప్పగించాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. రూ. 35 వేల కోట్ల నష్టాల్లో స్టీల్ ప్లాంట్ ఉందని చెప్పారు. ప్లాంట్‌కు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్రం వేగంగా ప్రయత్నిస్తోందని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed