తిరుపతి వెళ్తున్న చంద్రబాబు.. మధ్యలో అనూహ్య పరిణామం

by srinivas |   ( Updated:2024-06-12 15:25:57.0  )
తిరుపతి వెళ్తున్న చంద్రబాబు.. మధ్యలో అనూహ్య పరిణామం
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు గురువారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి చేరుకున్నారు. అయితే మధ్యలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక విమానం వద్దకు వెళ్తు్న్న చంద్రబాబు కాన్వాయ్‌ను ఓ కార్యకర్త వెంబడించారు. ఒక్కసారి చంద్రబాబును కలవాలంటూ కోరారు. దీంతో కాన్వాయ్ ఆపి కార్యకర్తను చంద్రబాబు కలిశారు. మిగిలిన కార్యకర్తలకు కూడా అభివాదం చేశారు. అనంతరం తిరుపతి బయల్దేరి వెళ్లారు.

Advertisement

Next Story
null