- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలవడం కుదరదు: Nara Bhuvaneshwari ములాఖత్ దరఖాస్తు తిరస్కరణ
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరికి చుక్కెదురు అయ్యింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడును కలిసేందుకు భువనేశ్వరి ములాఖత్ కోసం దరఖాస్తు చేశారు. అయితే జైలు అధికారులు ములాఖత్‌ను తిరస్కరించారు. చంద్రబాబు నాయుడుతో ములాఖత్ కలిసేందుకు అనుమతిని నిరాకరించారు. చంద్రబాబు నాయుడును కలిసేందుకు ములాఖత్ దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించడంపై నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారానికి మూడు సార్లు కలిసేందుకు అవకాశం ఉన్నప్పటికీ జైలు అధికారులు ములాఖత్ తిరస్కరించడం సరికాదని అన్నారు. ములాఖత్ వ్యవహారంలో ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నప్పటి నుంచి భువనేశ్వరి రాజమహేంద్రవరంలోనే ఉన్నారు. కొడుకు నారా లోకేశ్, కోడలు బ్రహ్మణిలు రాజమహేంద్రవరంలోనే ఉంటున్నారు. చంద్రబాబు నాయుడుకు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో భువనేశ్వరి ఆ కార్యక్రమాలు చూస్తున్నట్లు తెలుస్తోంది.
More News : ఢిల్లీలో లోకేశ్ మకాం : జాతీయస్థాయిలో మద్దతుకు ప్లాన్