- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్‌కు భారీ ఝలక్.. వైసీపీ ఇద్దరు ఎంపీల గుడ్‌బై!
దిశ, డైనమిక్‌బ్యూరో: వైసీపీకి ఇదో పెద్ద కుదుపు. జగన్‌కు నమ్మిన బంట్లుగా ఉన్న రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వీడుతున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ, బీద మస్తానరావు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. నేడు (గురువారం) వారు రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారిద్దరూ త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. మోపిదేవి, మస్తాన్‌రావు బాటలోనే మరికొందరు నేతలు నడవనున్నారు. కొందరు వైసీపీని వీడి టీడీపీ, బీజేపీ, జనసేనలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కీలక నేతలే పార్టీని వీడడం కార్యకర్తల్లో గుబులు రేపుతోంది.
ఇన్నాళ్లూ గుంభనంగా..
ఓటమి తర్వాత వైసీపీ ముఖ్యనేతలు చాలా గుంభనంగా ఉన్నారు. బయట ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. తమ రాజకీయ జీవితం బాగుండాలంటే వైసీపీ సరైన వేదిక కాదని పలువురు భావిస్తున్నారు. దీంతో వైసీపీకి దూరంగా జరగాలని నిర్ణయించుకున్నారు. ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి పార్టీ నుంచి ఎటువంటి సహకారం లభించడం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న వాపోయారు. పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న రోజా తన సామాజిక మాధ్యమ అకౌంట్లలో జగన్ ను అన్‌ఫాలో చేయడమేగాక వైసీపీ అనే పేరును తొలగించారు. తాజాగా ఎంపీలు పార్టీని వీడుతున్నారనే సమాచారం కలకలం రేపుతోంది. వైసీపీ నుంచి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ సభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. ఆ 11 మంది ఎంపీలలో ఇద్దరు ఇప్పటికే టీడీపీ అధినేతను కలిసినట్లు సమాచారం. వారికి కీలక హామీ లభించగానే పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది.
వైసీపీకి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా
వైసీపీకి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం సునీత వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. త్వరలోనే టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.