తిరుమలలో జంట హత్యల కలకలం

by Seetharam |   ( Updated:2023-10-06 07:06:16.0  )
తిరుమలలో జంట హత్యల కలకలం
X

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుపతిలో దారుణం జరిగింది. తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి యువరాజు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి వచ్చాడు. తిరుపతి కపిలతీర్థంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో బస చేసింది. అయితే లాడ్జిలోని రూమ్ నెంబర్ 302లో హర్షవర్థన్, మనీషా, యువరాజు ఉన్నారు. అయితే గురువారం రాత్రి వీరి ముగ్గురి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవ జరిగింది. దీంతో యువరాజు అనే వ్యక్తి క్షణికావేశంలో భార్య మనీషా, బావ మరిది హర్షవర్థన్‌లను కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం అలిపిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అటు తల్లీ, ఇటు మేనమామ హత్యకు గురవ్వడం, తండ్రిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇద్దరు చిన్నారులు బిక్కుబిక్కున విలపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed