Nara Lokesh:మంత్రి లోకేష్‌ను కలిసిన తుని ఆర్టీసీ బస్సు డ్రైవర్.. కారణం ఇదే!

by Jakkula Mamatha |   ( Updated:2024-12-04 11:44:54.0  )
Nara Lokesh:మంత్రి లోకేష్‌ను కలిసిన తుని ఆర్టీసీ బస్సు డ్రైవర్.. కారణం ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: కొన్ని రోజుల క్రితం బస్సు ముందు ‘దేవర’ మూవీ(Devara movie)లోని పాటకు తుని ఆర్టీసీ బస్సు డ్రైవర్(RTC Bus Driver) లోవరాజు డాన్స్ చేసిన వీడియో వైరల్(Video Viral) అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సస్పెండ్ అయ్యారు. ఈ క్రమంలో అతను మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) చొరవతో తిరిగి విధుల్లో చేరారు. ఈ క్రమంలో నేడు(బుధవారం) కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపో డ్రైవర్ లోవరాజు(Driver Lovaraju) మంత్రి లోకేష్‌ను కలిశారు. తన సస్పెన్షన్ రద్దు చేయించి, తిరిగి విధుల్లోకి తీసుకునేలా చొరవ చూపించిన లోకేష్‌కు కుటుంబంతో సహా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

అయితే.. సోషల్ మీడియా(Social Media)లో డ్రైవర్ లోవరాజు డాన్స్ చూసి మంత్రి లోకేష్ కూడా మెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విధి నిర్వహణలో ఉండగా నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో లోవరాజును అధికారులు సస్పెండ్ చేశారు. ఇది మంత్రి లోకేష్ దృష్టికి రావడంతో సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయిస్తానని హామీ ఇచ్చారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా కలుస్తానని మాట ఇచ్చారు. దీంతో లోకేష్ ను లోవరాజు కుటుంబంతో సహా కలిశారు. ఈ సందర్భంగా లోవరాజు యోగక్షేమాలు మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed