- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
High Court: ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దుపై విచారణ వాయిదా
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. ఇరువాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది. వైఎస్ వివేకా హత్యకేసులో ఎర్ర గంగిరెడ్డి కీలక నిందితుడు అని సీబీఐ ఆరోపించింది. కేసు విచారణ తుది దశకు వచ్చిన నేపథ్యంలో అతడి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నాగేంద్ర, అనిల్ వాదనలు వినిపించారు. వివేకాను హత్యకు కుట్ర చేసింది, హత్య చేయడంలో గంగిరెడ్డిది కీలకపాత్ర అని సీబీఐ వాదించింది. ఈ కేసును తొలుత దర్యాప్తు చేసిన సిట్ చార్జిషీటు వేయకపోవడం వల్లే గంగిరెడ్డికి బెయిల్ లభించిందని సీబీఐ వివరించింది. ప్రస్తుతం దర్యాప్తు కీలక దశలో ఉందని.. ఈ పరిణామాల నేపథ్యంలో గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోర్టుకు విన్నవించింది.
మరోవైపు ఈ కేసులో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఏపీ హైకోర్టు గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేసిందని ఆయన తరఫు న్యాయవాది శేషాద్రినాయుడు వాదించారు. సాక్షులను ప్రభావితం చేస్తారన్న అనుమానంతో బెయిల్ రద్దు చేయడం సరికాదన్నారు. మరోవైపు ఇదే కేసులో వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ సైతం వాదనలు వినిపించారు. గంగరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ వాదనలను న్యాయవాది ఎల్ రవిచందర్ సమర్థించారు.
ఇవి కూడా చదవండి :
దస్తగిరికి భారీ భద్రత.. ఇంటి వద్ద తుపాకులతో పోలీసుల పహారా
వాదనలు షురూ.. ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసుపై వాడివేడి వాదనలు