- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Trending: నాన్న.. నేను ఏ తప్పూ చేయలేదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న యువతి సూసైడ్ నోట్
దిశ, వెబ్‌డెస్క్: ఓ ఫోన్ కాల్ యువతి బలవన్మరణానికి కారణమైన విషాద ఘటన కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన రేణుక మాచర్లలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. అయితే, ఇటీవలే కాలేజీలో ఓ సీనియర్‌తో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ క్యాంపస్‌లో అన్నా, చెల్లులుగా మెలిగేవారు. కాగా, రేణుక సెలవుల్లో ఇంటికి రాగా.. ఆ సీనియర్ రేణుక మాట్లాడేందుకు ఫోన్ చేశాడు. ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో ఆ ఫోన్ కాల్‌ను రేణుక అటెంప్ట్ చేయలేదు. ఈ క్రమంలో ఫోన్‌లో మిస్డ్ కాల్ చూసిన రేణుక తండ్రి ఆగ్రహంతో ఊగిపోయాడు.
అబ్బాయిలతో ఫోన్లు ఏంటని మందలించాడు. భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే.. ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చాడు. చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా పెంచిన తండ్రి తనపై కోపగించుకోవడం జీర్ణించుకోలేని రేణుక తీవ్ర మనస్తాపానికి గురైంది. అనంతరం యువతి ‘నాన్న నేను ఏ తప్పు చేయలేదు’ అంటూ ఓ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం రేణుక రాసిన సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆ సూసైట్ నోట్ చూసిన కొందరు నెటిజన్లు.. తొందరపడ్డావ్ రేణుక అని, అసలు విషయం ఇంట్లో చెప్పాల్సి ఉండే అంటూ కామెంట్ చేస్తున్నారు.