- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయ్యప్ప మాలధారులకు అలర్ట్.. ఆ విరుముడులు వద్దన్న ట్రావెన్ కోర్ బోర్డు
దిశ, ఏపీ బ్యూరో: పవిత్రమైన పంబా నదిని కలుషితం చేయకుండా శబరికి వచ్చే అయ్యప్ప భక్తులు కొన్ని మార్గదర్శకాలను పాటించాలని, సన్నిధానంలో స్వామి దర్శనానికి ఆన్ లైన్‌లో టైమ్ స్లాట్ కేటాయించే సదుపాయాన్ని వినియోగించుకోవాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఒక ప్రకటనలో కోరింది. మండల- మకరవిళక్కు 2024-25 సందర్భంగా దేవస్థానం ప్రధాన తంత్రీ జారీ చేసిన నియమ నిబంధనలను బోర్డు అన్ని రాష్ట్రాలకు పంపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని అయ్యప్ప భక్తులకు కొన్ని సూచనలు చేసింది.
ముఖ్య గమనిక ఏమిటంటే..
ప్రతిరోజూ సన్నిధానం చేరే భక్తుల సంఖ్య దాదాపు 70 వేల నుంచి 80 వేల వరకు ఉంటుంది. కానీ.. ప్రవేశ ద్వారం నుంచి కేవలం పది వేల మందికి మాత్రమే సన్నిధానం చేరే అవకాశం ఉన్నందున, భక్తులు ఆన్ లైన్ ద్వారా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని దేవస్థానం పేర్కొంది. తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని ఎంచుకోవచ్చని దేవస్థానం తెలిపింది. పంబ ఎంట్రీ పాయింట్ వద్ద బుకింగ్ సౌకర్యాన్ని వినియోగించుకునే భక్తులు ఆధార్ కార్డు తీసుకుని రావాలని, విదేశీ భక్తులైతే తమ పాస్ పోర్టు కాపీలను వెంట తీసుకుని రావాల్సిందిగా పేర్కొంది.
ప్లాస్టిక్ ఇరుముడు కట్లు వద్దు..
పవిత్రమైన పంబా జలాల్లో పర్యావరణాన్ని కాపాడటం కోసం ప్లాస్టిక్ ఇరుముడు కట్లను వినియోగించవద్దని దేవస్థానం తంత్రీ పేర్కొన్నారు. సన్నిధానం పవిత్రతను కాపాడుతూ ప్లాస్టిక్ వినియోగ రహిత వాతావరణాన్ని భక్తులు పాటించాలని తంత్రీ కోరారు. భక్తులు తమ దీక్షా వస్త్రాలను పంబా నదిలోకి విసిరి వేయరాదని, పంబా పవిత్రతను కాపాడుతూ నదీ జలాలను పరిశుద్ధంగా ఉంచాలని దేవస్థానం కోరింది. భక్తుల సంఖ్య అధికంగా ఉండే దృష్ట్యా అందరికీ అయ్యప్ప దర్శనం జరిగేలా, ఏ ఒక్క భక్తుడూ అయ్యప్ప దర్శనం చేసుకోలేకపోయాననే మాట రాకూడదనే దిశలో చర్యలు తీసుకుంటున్నామని, సహకరించాలని బోర్డు అధ్యక్షుడు ప్రశాంత్ విజ్ఞప్తి చేశారు.