విషాదం: తమ్ముడిని కాపాడబోయి అన్న మృతి

by Seetharam |
విషాదం: తమ్ముడిని కాపాడబోయి అన్న మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో : కళ్లెదుటే తమ్ముడు ప్రమాదంలో ఇరుక్కున్నాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించి అన్నయ్య ప్రాణాలొదిలాడు. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు రూరల్ ఊప్పుటూరుకి చెందిన విజయ్ కుమార్ ఇంటి ఆవరణలో ఆరేసిన టవల్‌ను తీస్తున్నాడు. టవల్ తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఈ విషయాన్ని గమనించిన అన్న ఉప్పుటూరయ్య సోదరుడిని కాపాడేందుకు ప్రయత్నించాడు. తమ్ముడిని రక్షించేందుకు ప్రయత్నించి కరెంట్ షాక్‌కు గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. బాధితులను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా ఉప్పుటూరయ్య అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మరోవైపు విజయ్ కుమార్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తమ్ముడిని కాపాడబోయి అన్న ప్రాణాలొదలడంతో కుటుంబంలో విషాదచ్ఛాయలు అలముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed