చరిత్రలో నిలిచిపోతుంది.. జనసేన సభపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-03 12:50:38.0  )
చరిత్రలో నిలిచిపోతుంది.. జనసేన సభపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ(Jana Sena Party) ఆవిర్భావ దినోత్సవ సభపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు(Bunny Vasu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఛావా సినిమా ట్రైలార్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఆయన జనసేన సభ గురించి మాట్లాడారు. ‘పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగబోయే తొలి సభ కావడంతో అందరం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ సభ చరిత్రలో నిలిచిపోయేలా ఉంది. పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. నాకు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు. వందశాతం నాకు అప్పగించిన బాధ్యతలు పూర్తి చేస్తా. సభను సూపర్ డూపర్ సక్సెస్ చేసేందుకు కృషి చేస్తా.. కాకినాడ జిల్లా వ్యాప్తంగా సభకు సంబంధించిన విషయంలో ఒక వైబ్ అయితే క్రియేట్ అయింది’ అని బన్నీ వాస్ చెప్పుకొచ్చారు.

వచ్చే మార్చి 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జనసేన ఆవిర్భావ దినోత్సవ(Jana Sena Formation Day) సభ నిర్వహించబోతున్నారు. ఇటీవలే సభా ప్రాంగణం వద్ద వేదిక నిర్మాణం పనులను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ భూమి పూజ చేసి ప్రారంభించారు. పార్టీ ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గం, ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీ సభ్యులతో కలసి పనులకు శ్రీకారం చుట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య భూమి పూజా కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత నిర్వహిస్తోన్న తొలి ఆవిర్భావ సభ కావడంతో పార్టీ ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్తుంది. రాష్ట్ర ప్రజానీకానికి అద్భుతమైన భవిష్యత్తు ఉండేలా జనసేన పార్టీ మీ వెంట ఉంటుందనే నమ్మకం కల్పించేలా ఆవిర్భావ సభ పండగలా నిర్వహిద్దామని నాదెండ్ల మనోహర్ వివరించారు.

Next Story