Tirupati Laddu: తిరుపతి లడ్డూ కల్తీ వివాదం.. శ్రీ విద్య పీఠాధిపతి సంచలన వ్యాఖ్యలు

by Shiva |
Tirupati Laddu: తిరుపతి లడ్డూ కల్తీ వివాదం.. శ్రీ విద్య పీఠాధిపతి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లడ్డూ (Tirumala Laddu) కల్తీ వివాదంపై ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టిన వారు ఎంతటి వారైనా విడిచిపెట్టొద్దని కామెంట్ చేస్తున్నారు. జరిగిన ఘటనపై వెంటనే ప్రభుత్వం అత్యున్నత దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా, ఇదే అంశంపై శ్రీ విద్య పీఠాధిపతి వాసుదేవానందగిరి స్వామి (Vasudevanandagiri Swami) ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డు కల్తీ వివాదంతో భక్తుల విశ్వాసం సన్నగిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి దురాగతానికి పాల్పడిన దుర్మార్గులను న్యాయస్థానం ఎదుట నిలబెట్టాల్సిందేనని స్పష్టం చేశారు.

స్వామి వారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసినట్లుగా అన్ని టెస్టింగ్ ల్యాబ్స్ (Testing Labs) ఒకే రిపోర్టును ఇచ్చాయనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. అయితే, వైసీపీ ప్రభుత్వ (YCP Government) హయాంలో అన్యమతస్థులకు హిందూ దేవాలయాల్లో (Hindu Temples) ఎలాంటి పదవులు ఇవ్వకూడదని గతంలో తాము కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. ఆ పిటిషన్ వేసినందుకు జగన్ ప్రభుత్వం తమపై అక్రమంగా కేసులు బనాయించి తమ నోరు నొక్కేసిందని ఆరోపించారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం నిరంతరం ప్రసాదాల విషయంలో పర్యవేక్షణ చేపట్టాలని వాసుదేవానందగిరి స్వామి సూచించారు.

Next Story

Most Viewed