తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ దుర్గగుడి బంద్.. తిరిగి దర్శనాలు ఎప్పుడంటే..?

by Javid Pasha |   ( Updated:2023-10-28 14:37:24.0  )
తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ దుర్గగుడి బంద్.. తిరిగి దర్శనాలు  ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రగ్రహణం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ తలుపులను అధికారులు మూసివేశారు. అలాగే తిరుమలలో వెంగమాంబ అన్నదాన సత్రాన్ని కూడా బంద్ చేశారు. రాత్రి 7.05 గంటలకు తిరుమల శ్రీవారి తలుపులను మూసివేయగా.. రేపు తెల్లవారుజామున 3.15 గంటల తర్వాత తిరిగి తెరవనున్నారు. శుద్ది, సుప్రభాత సేవ నిర్వహించిన తర్వాత శ్రీవారి ఆలయం తెరుచుకోనుంది.

అటు విజయవాడలోని దుర్గగుడి ఆలయం కూడా మూతపడింది. రేపు తిరిగి ఉదయం 9 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. ఇక శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని మూసివేయగా.. రేపు ఉదయం 7 గంటల తర్వాత దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. ఇక సింహచలం, ఒంటిమిట్ట ఆలయాలను కూడా మూసివేశారు.

Advertisement

Next Story

Most Viewed