Tirumala Samacharam: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

by Shiva |   ( Updated:2024-06-10 03:33:16.0  )
Tirumala Samacharam: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి సన్నిథి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం శ్రీవారిని దర్శనానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 16 గంటల సమయం పడుతోంది. ఎల్లుండితో వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. సోమవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఆదివారం స్వామి వారిని 81,744 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 36,833 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.34 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed