Tirumala Samacharam: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

by Shiva |
Tirumala Samacharam: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం శ్రీవారిని దర్శనానికి జనం మోస్తారుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 8 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి వేచి చూస్తున్నారు. మంగళవారం స్వామి వారిని 71,409 మంది భక్తులు దర్శించుకోగా, 26,128 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story