ఘోర ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి

by Mahesh |
ఘోర ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయచోటి మండలం కొత్తపేటలో శనివారం ఉదయం సమయంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలి పోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా, తల్లి అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story