- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒడిశా నుంచి ఆంధ్రాకు పులి చర్మం.. మధ్యలో అడ్డగించిన పోలీసులు
X
దిశ, అల్లూరి జిల్లా: ఒడిశా నుంచి ఆంధ్రాకు పులి చర్మాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అటవీ అధికారులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని సీలేరు సరిహద్దు ప్రాంతంలోని ఒడిశా నుంచి ముగ్గురు వ్యక్తులు పులి చర్మాన్ని ఆంధ్రాకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీనిపై ముందస్తు సమాచారం రావడంతో అటవీశాఖ అధికారులు సీలేరుకు సమీపంలోని పొట్టేరు కెనాల్ రోడ్డులో అర్ధరాత్రి మాటు వేసి, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులకు ఆపి, తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వారు వెంట తీసుకొస్తున్న బ్యాగులో 1.13 మీటర్ల పొడవున్న పులి చర్మం ఉన్నట్టు గుర్తించి, ముగ్గుర్ని అదపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పులి వయసు మూడేళ్లు ఉంటుందని డీఎఫ్ఓ ప్రతాప్ కోటపల్లి తెలియజేశారు.
Advertisement
Next Story