ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఇదే.. అటవీ ప్రాంతంలో రోడ్డు సౌకర్యం లేకున్నా..

by Ramesh N |
ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఇదే.. అటవీ ప్రాంతంలో రోడ్డు సౌకర్యం లేకున్నా..
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఫోర్త్ ఫేజ్‌లో భాగంగా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంట్ స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కాగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో ఓ ఘటన ఆసక్తికరంగా మారింది.

ఓటు వేయడానికి గిరిజనులు ముందుకు వచ్చిన విధానం చర్చానీయాంశంగా మారింది. రోడ్లు, వాహనాలున్నా కొంత మంది ఓటు వేయడానికి బద్ధకిస్తుంటారు. కానీ ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ ఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పింది. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులు తమకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఓ మహిళను ఓటు వేయడానికి డోలీలో తీసుకెళ్లారు. వీరిని చూసైనా ఓటు వేసేందుకు జనాలు ముందుకు రావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story