Thirumala: తిరుమల చేరుకున్న హోం మంత్రి అనిత..! భక్తుల భద్రత‌పై కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-07-19 11:44:20.0  )
Thirumala: తిరుమల చేరుకున్న హోం మంత్రి అనిత..! భక్తుల భద్రత‌పై కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మెట్ల దారిలో తిరుమల వెళ్లే భక్తులు సురక్షితంగా చేరుకునేలా చర్యలు చేపడతామని, అడవి జంతువులు దాడి చేయకుండా ఫెన్షింగ్ ఏర్పాటు చేస్తామని ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న ఆమె శ్రీవారి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నడకదారి భక్తులకు సులభంగా దర్శనం కల్పించేందుకు గతంలో టోకెట్లు ఇచ్చే వారని ఇప్పడు మళ్లీ ఆ విధానాన్ని తీసుకొచ్చి భక్తులకు టోకెన్లు ఇవ్వాలని సూచించారు. అలిపిరి మార్గంలో వచ్చే భక్తులకు భద్రత కల్పించేందకు చర్యలు చేపడతామని, అడవి జంతువులు దాడి చేయకుండా ఫెన్షింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

గత ప్రభుత్వం అడవి జంతువుల నుంచి రక్షించుకునేందుకు భక్తులకు గుతపలు ఇవ్వడం హస్యాస్పదంగా అనిపిందన్నారు. అలాగే నరసాపురం ఎంపీడీఓ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని, ఆయన సురక్షితంగా తిరిగి రావాలని కోరుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఎంపీడీవో కుటుంబాన్ని కలిశారని, వారి కుటుంబానికి ప్రభత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే మా ప్రభుత్వంలో ఉద్యోగులపై ఎలాంటి ఒత్తిడి ఉండదని, స్వేచ్ఛగా విధులు నిర్వర్తించేలా ప్రభుత్వం సహకరిస్తుందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed