- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎలక్షన్ కోడ్ అమలు.. వాటిని తిరిగి ఇవ్వాలని వాళ్లకు ఆదేశాలు..?
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో లైసెన్సుడ్ ఆయుధాలు కలిగి ఉన్నవారందరూ వాటిని వారి సమీప పోలీసు స్టేషన్ లో అందజేయాలని రాష్ట్ర పోలీసు శాఖ తాజాగా సూచించింది. ఎన్నికలయ్యేంత వరకు కొత్త ఆయుధాల జారీని కూడా నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. తమ వద్ద సమాచారం ఉన్న లైసెన్సుదారులందరికీ పోలీసులు ఈ సమాచారాన్ని పంపుతున్నారు.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ లు ఫోన్లు చేసి మరీ లైసెన్సడ్ తుపాకులను స్వాధీనం చేసుకొంటున్నారు. రాష్ట్రంలో సుమారు 10 వేలమంది వరకు గన్ లైసెన్సు కలిగి ఉన్నట్లు సమాచారం. విశాఖపట్నం మన్యం లో నాటు తుపాకులను కూడా తిరిగి ఇవ్వాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్ పి ఆదేశించారు. కాగా పోలీసుల ఆదేశాల మేరకు ఇప్పటికి 300 లకు పైగా తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తుపాకులు ఎన్నికల సమయంలో బయట వుంటే హింసాత్మక సంఘటనలు జరగవచ్చనే అభిప్రాయంతో పోలీసులు స్వాధీనం చేసుకొంటున్నారు. ఇక గతంలో రాయలసీమ జిల్లాల్లో ఆత్మ రక్షణ కోసం వేల సంఖ్యలో గన్ లైసెన్స్ లను పోలీసు శాఖ జారీ చేసిందని సమాచారం.