Nara Lokesh:పాఠశాలలో మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులను అడిగిన ప్రశ్నలు ఇవే!?

by Jakkula Mamatha |   ( Updated:2024-08-30 15:03:46.0  )
Nara Lokesh:పాఠశాలలో మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులను అడిగిన ప్రశ్నలు ఇవే!?
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్య వ్యవస్థ పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలనీ అధికారులను ఆదేశించారు. విద్యా వ్యవస్థ పై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటారు. ఈక్రమంలో తాజాగా విశాఖలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పాఠశాలకు వచ్చిన మంత్రి లోకేష్‌కు విద్యార్థులు, ఉపాధ్యాయులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం తెలిపారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోనే ఇది అతిపెద్ద స్కూల్ అని, ఇక్కడ చదువుకున్న పిల్లలు ఐఐటీ వంటి ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు పొందారని లోకేష్ గుర్తు చేశారు. విద్యార్ధుల దగ్గర ఉన్న పాఠ్యపుస్తకాలను పరిశిలించారు. ఓ విద్యార్థిని పాఠ్య పుస్తకంలోని ఓ పేరా చూపిస్తూ దాన్ని చదువమన్నారు. అలాగే విద్యార్థులకు పలు ప్రశ్నలు కూడా వేశారు. సౌతాఫ్రికా అంటే ఏమిటి? నెల్సన్ మండేలా గురించి తెలుసా!? అని విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ ప్రశ్నలు వేశారు.

Advertisement

Next Story

Most Viewed