- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Tiruapati: ప్రభుత్వాస్పత్రి దగ్గర వైసీపీ నేతల ఆందోళన.. ఉద్రిక్తత
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి ప్రభుత్వాస్పత్రి(Tirupati Government Hospital) దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యలమంద(Yalamanda)లో సోమవారం బాలికపై లైంగిక దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించేందుకు వైసీపీ నేతలు వెళ్లారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆస్పత్రిలోకి వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. ఈ ఘటనతో వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతి జిల్లాలో రోజుకో అఘాయిత్యం జరుగుతోందని తిరుపతి వైసీపీ ఇంచార్జి భూమన అభినయ్ రెడ్డి(Bhumana Abhinay Reddy is the in-charge of Tirupati YCP) అన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు భద్రత లేదని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అసమర్ధత, చేతగాని కారణంగా అసాంఘిక కార్యక్రమాలు, మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు పెట్రేగి పోతున్నాయని మండిపడ్డారు. గత వైస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశా చట్టాన్ని రద్దు చేసిన ఈ కూటమి ప్రభుత్వం ప్రజల భద్రతను, శాంతి భద్రతలను గాలికి వదిలేసిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని సకాలంలో స్పందించి నేరస్తులను కఠినంగా శిక్షించాలని అభినయ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ గురుమూర్తి(YCP MP Gurumurthy) మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు